ఎగ్ ఖుర్మా

Durga
గ్రుడ్లు:  4 ఉల్లిపాయలు: 100 గ్రా. టొమాటొలు : 3 పచ్చిమిర్చి: 2 కరివేపాకు : 1 టేబల్ స్పూన్ కొత్తిమిర : 2 టేబల్ స్పూన్  ఎందుకొబ్బరిపొడి : 2 టేబల్ స్పూన్  ధనియాలపొడి: 2 టేబల్ స్పూన్  గసగసాలు : 1 టేబల్ స్పూన్  గరం మసాలా : 1 టేబల్ స్పూన్ పెరుగు : 50 టేబల్ స్పూన్ అల్లం వెల్లుల్లి : 2 టేబల్ స్పూన్ ఉప్పు తగినంత నూనె : 3 టేబల్ స్పూన్  తయారీ చేయువిధానం :   ముందుగా గ్రుడ్లను ఉడకబెట్టి పెంకు తీసి చాకుతో గాట్లు పెట్టి ఉంచాలి. నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు మెత్తపడేవరకు వేయించాలి. పసుపు, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి అవి మెత్తపడేవరకు వేయించాలి. కొబ్బరిపొడి, వేయించిన గసగసాలు, ధనియాలపొడి, గరం మసాలా పొడి, పెరుగు కలిపి మెత్తగా రుబ్బుకొని ఉడుకుతున్న కూరలో కలపాలి. కొద్ది సేపు ఉడికిన తర్వాత గ్రుడ్లు, కారం ,ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. నూనె తేలిన తర్వాత కొత్తిమిర చల్లి దింపేయాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: